హనుమాన్ జయంతి శోభాయాత్రకు షరతులతో అనుమతి

హనుమాన్ జయంతి శోభాయాత్రకు షరతులతో అనుమతి

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్బంగా మంగళవారం జరిగే వీర హనుమాన్ విజయ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను ఈసారి కూడా నిర్వహించాలని వీ హెచ్ పీ, భజరంగ్ దళ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే కరోనా నేపధ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బన్ హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్రకు షరతులతో అనుమతిచ్చింది. వీర హనుమాన్ విజయ యాత్రలో 21 మందికి మించవద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఒక బైక్ పై ఒక్కరే శోభాయాత్రలో పాల్గొనాలని, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శోభాయాత్ర జరుపుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. శోభాయాత్రను మొత్తం వీడియో చిత్రీకరించి నివేదిక సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కు హైకోర్టు స్పష్టం చేసింది.